ఉపరాష్ట్రపతి పదవికి ధన్‌ఖడ్ రాజీనామా – పవన్ స్పందన

దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాలను చుప్తూ ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ ధన్‌ఖడ్ సేవలను కొనియాడారు.

పవన్ కల్యాణ్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ – “గౌరవనీయులైన భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ జీ, మీరు భారత దేశానికి చేసిన సేవలు అమూల్యమైనవి. మీరు ఉపరాష్ట్రపతి పదవిని నిబద్ధతతో, నిష్పాక్షికంగా నిర్వహించారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ, సమగ్రతతో బాధ్యతలు నిర్వర్తించారు. రాజకీయ ఒత్తిడికి లోనుకాకుండా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా వ్యాఖ్యలు చేసిన తీరు అభినందనీయం. మీరు త్వరగా ఆరోగ్యంగా కోలుకోవాలని, ఆనందంగా జీవించాలనేది మా ఆకాంక్ష,” అంటూ పేర్కొన్నారు.

జగదీప్ ధన్‌ఖడ్ 2022 ఆగస్టు 11న భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో నుంచి ఆయన రాజ్యసభ ఛైర్మన్‌గా సేవలందించారు. అంతకుముందు, 2019 నుంచి 2022 వరకూ పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పనిచేశారు. రాజీనామాకు ముందు వర్షాకాల పార్లమెంటు సమావేశాలకు అధ్యక్షత వహించిన ధన్‌ఖడ్, ఆరోగ్యకర చర్చలు జరపాలని అన్ని పార్టీలను కోరారు.

Read More : టీటీడీ పాలకమండలి భేటీ నేడు

One thought on “ఉపరాష్ట్రపతి పదవికి ధన్‌ఖడ్ రాజీనామా – పవన్ స్పందన

Comments are closed.