వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా, ఆయనను చూడడానికి, మద్దతుగా నిలబడడానికి భారీగా జనసంద్రం చేరుకుంటోంది. ఇది చూస్తుంటే ఆశ్చర్యం కలగకమానదు. కేవలం ఎనిమిది నెలల్లోనే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఈ స్థాయిలో ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటుందా? అనే సందేహం సహజంగానే వస్తోంది.
తెలుగుదేశం పార్టీకి కృష్ణా, గుంటూరు జిల్లాలు తమ గుండెకాయలుగా భావించేవి. అయితే, ఇక్కడే జగన్ కు ఎదురైన అపూర్వమైన ప్రజాదరణ చూస్తే, కూటమి ప్రభుత్వానికి ఇది పెద్ద సంకేతంగా మారినట్లు కనిపిస్తోంది. ప్రజల ఊహించని స్పందనతో టీడీపీ శిబిరాల్లో కలవరం మొదలైనట్లు అనిపిస్తోంది.
తప్పుడు కేసులో విజయవాడ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ పరామర్శించిన తరువాత, మరుసటి రోజే గుంటూరు మార్కెట్ యార్డులో గిట్టుబాటు ధరలు లేక కష్టాలు ఎదుర్కొంటున్న రైతులను కలుసుకున్నారు. అయితే, ఈ కార్యక్రమాలకు ప్రత్యేక రవాణా ఏర్పాట్లు లేకున్నా ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున హాజరవడం గమనార్హం. ఇది కూటమి సర్కార్ పట్ల పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనం.
ప్రజల్లో మారుతున్న ఈ ఒరవడి చూస్తుంటే, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రెడ్ బుక్’ విధానాలు ప్రజాస్వామ్యంపై చేసే దాడిగా మారాయా? ప్రజల్లో తిరుగుబాటు మంటలు రగులుతున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

One thought on “జగన్ wherever he goes.. ప్రజల ప్రేమే నిదర్శనం! కూటమి ప్రభుత్వానికి బిగ్ షాక్!”
Comments are closed.