నెల్లూరులో జగన్ పర్యటన ఉద్రిక్తం – పోలీసుల లాఠీఛార్జ్

నెల్లూరులో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. జైలులో నిర్బంధంలో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు బుధవారం నెల్లూరుకు చేరుకున్న జగన్‌ను చూసేందుకు వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భారీగా గుమికూడిన కార్యకర్తలను కట్టడి చేసే ప్రయత్నంలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు కఠిన భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 900 మంది సిబ్బందిని మోహరించి అన్ని మార్గాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించారు.

కాసేపట్లో జగన్ కాకాణి గోవర్ధన్ రెడ్డిని జైలులో కలవనున్నారు. జగన్ పర్యటనతో నెల్లూరులో రాజకీయ వేడి మరింత పెరిగింది.

Read More : Updates : ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం

One thought on “నెల్లూరులో జగన్ పర్యటన ఉద్రిక్తం – పోలీసుల లాఠీఛార్జ్

Comments are closed.