ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ మేళా నిర్వహణలోపాలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) బిజేపీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. మహాకుంభ మేళా నిర్వహణలో పేదలకు సరైన ఏర్పాట్లు లేకపోవడం, కేవలం డబ్బున్నవారికి, వీఐపీలకు మాత్రమే క్యాంపులు లభించడంతో మమతా ఫిర్యాదు చేశారు. ”ఈ మహాకుంభం ‘మృత్యుకుంభ్’గా మారుతోంది. సరైన ప్లానింగ్ లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది,” అని ఆమె అన్నారు.
మమతా బెనర్జీ బంగ్లాదేశీ ఛాందసవాదులతో తనకు సంబంధాలు ఉన్నాయంటూ బిజేపీ చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ, తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అలాగే, ఈ ఆరోపణలను రుజువుచేయాలని సవాలు విసిరారు.
ఇక, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో విపక్ష నేత సువేందు అధికారి (Suvendu Adhikari) రాష్ట్రంలోని పరిస్థితులపై మమతాను తప్పుపట్టారు. బంగ్లాదేశీ, రోహింగ్యా (Rohingya) వలసదారులను రాష్ట్రంలో ఉంచేందుకు మమతా ప్రభుత్వం అనుమతి ఇస్తోందని ఆరోపించారు.

One thought on “మహాకుంభ మేళా నిర్వహణపై మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు”
Comments are closed.