అమెరికాలో మిలిటరీ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని లిమూరే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సమీపంలో అత్యాధునిక F-35 యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో విమానం నేలపై పడిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే ఎయిర్ ఫోర్స్ మరియు స్థానిక అత్యవసర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇంజిన్ లోపం, సాంకేతిక సమస్యలతో పాటు వాతావరణ కారణాలు కూడా పరిశీలనలో భాగమని అధికారులు తెలిపారు. పైలట్ గాయపడ్డారా లేదా సురక్షితంగా బయటపడ్డారా అన్న వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు వెలువడే వరకు ఎయిర్ ఫోర్స్ విచారణ కొనసాగించనుంది.
ఈ ఘటనతో ప్రాంతంలో ఆందోళన నెలకొంది. అమెరికా రక్షణ శాఖ ఈ ప్రమాదంపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది.
Read More : బ్రిటన్‌పై విరుచుకుపడ్డ నెతన్యాహు

One thought on “కాలిఫోర్నియాలో కూలిన ఎఫ్-35 యుద్ధ విమానం”
Comments are closed.