పోర్టులో భారీ పేలుడు – 400 మందికి గాయాలు

ఇరాన్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. బందర్ అబ్బాస్ నగరంలోని షాహిద్ రాజే పోర్టు వద్ద శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో ప్రాంతం మొత్తం ఒక్కసారిగా హడలెత్తిపోయింది. సమాచారం మేరకు ఈ ప్రమాదంలో 400 మందికిపైగా గాయాలపాలైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో సమీప ప్రాంతాలకు కూడా తీవ్ర ప్రభావం చేరుకుంది. బాధితులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడుకు గల కారణాలపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు ఇది యాక్సిడెంట్ వల్ల జరిగిందా లేదా కుట్ర మూలమా అన్నదానిపై స్పష్టత రాలేదు. ఘటనపై మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి.

Read More : సింధూ జలాలపై భారత్ నిర్ణయంపై సోషల్ మీడియాలో వ్యతిరేక స్పందనలు