ఇస్లామాబాద్: పాకిస్థాన్ మరోసారి భారత్ విమానాలపై గగనతల ప్రయాణానికి నిషేధాన్ని పొడిగించింది. భారత సైనిక, పౌర విమానాలపై ఆగస్టు 24 వరకూ నిషేధం అమల్లో ఉంటుందని పాక్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ (PAA) శుక్రవారం ప్రకటించింది.
ఈ మేరకు జారీ చేసిన నోటామ్ ప్రకారం.. నిషేధం శుక్రవారం మధ్యాహ్నం 3:50 నుంచి అమల్లోకి వచ్చి, ఆగస్టు 24 ఉదయం 5:19 గంటల వరకు కొనసాగుతుంది. ఇక మరోవైపు, పాకిస్థాన్ విమానాల కోసం భారత్ కూడా తన గగనతలాన్ని జులై 24 వరకు మూసివేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది జవాన్లు మరణించగా, ఆ తర్వాతే భారత్ గగనతల ఆంక్షలు విధించింది. భారత్ విధించిన ఆంక్షలు ఈ నెల 24తో ముగియనున్నప్పటికీ, మరోసారి పొడిగించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.
ఈ పరస్పర గగనతల నిషేధాలతో రెండు దేశాల మధ్య విమానయాన సేవలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.
Read More : కంపెనీ సీఈఓ–హెచ్‌ఆర్ చీఫ్ ముద్దు వీడియో వైరల్..!
