ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. శనివారం రాత్రి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) చేపట్టిన వైమానిక దాడిలో ఇరాన్‌కు చెందిన ఖుడ్స్ ఫోర్స్ కమాండర్ సయీద్ ఇజాదీ మృతిచెందారు. ఈ దాడి ఖోమ్ నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌పై జరిపినట్లు ఐడీఎఫ్ అధికారికంగా ప్రకటించింది.
ఐడీఎఫ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, సయీద్ ఇజాదీ హమాస్ మరియు ఇరాన్ ప్రభుత్వానికి మధ్య ప్రధాన అనుసంధానకర్తగా పనిచేశారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన హమాస్ దాడికి ఇజాదీ కీలకంగా పాల్పడ్డారని ఆరోపించారు. అలాగే, హమాస్‌కు ఇరాన్ తరఫున ఆర్థిక, సాంకేతిక సహాయం సమకూర్చడంలో కూడా ఇజాదీ ప్రమేయముందని పేర్కొన్నారు.
లెబనాన్ నుంచి హమాస్ బలగాలను నడిపిస్తూ, గాజాలో ఆ సంస్థ సైనిక సామర్థ్యాన్ని పునర్నిర్మించడంలో ఇజాదీ కీలక పాత్ర పోషించారని ఐడీఎఫ్ పేర్కొంది. ఈ ఘటనతో ఇజ్రాయెల్ రక్షణ దళాలు తమపై జరుగుతున్న సైధ్ధాంతిక దాడులకు గట్టిగా ప్రత్యుత్తరం ఇస్తున్నాయని స్పష్టం చేస్తోంది.
ఇదిలా ఉండగా, ఇజాదీ మృతిపై ఇరాన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రతిస్పందన వెలువడలేదు. అయితే, ఈ ఘటన నేపథ్యంలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనవచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Read More : నోబెల్ బహుమతిపై ట్రంప్ అసంతృప్తి వ్యాఖ్యలు

2 thoughts on “ఇజ్రాయెల్ దాడిలో ఖుడ్స్ కమాండర్ ఇజాదీ మృతి”
Comments are closed.