‘ఇంటర్స్టెల్లార్’ రీ-రిలీజ్ సంచలనం – మరోసారి థియేటర్లలో గ్రాండ్ రన్!

Interstellar

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ సైఫై మాస్టర్‌పీస్ ఇంటర్స్టెల్లార్ భారతీయ బాక్సాఫీస్ వద్ద అరుదైన ఘనత సాధించింది. తక్కువ వ్యవధిలోనే మరోసారి థియేటర్లలోకి తిరిగి వచ్చి ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేసింది. ఈ హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ఫిబ్రవరి 7, 2025న భారతీయ థియేటర్లలో వారంరోజుల పాటు ప్రదర్శించబడింది.

ఇప్పుడీ మహత్తరమైన సినిమా తన 10వ వార్షికోత్సవాన్ని మరింత ఘనంగా జరుపుకోవడానికి మరోసారి రీ-రిలీజ్ అవుతోంది. మార్చి 14, 2025న ఇంటర్స్టెల్లార్ మరోసారి భారతీయ థియేటర్లలో సందడి చేయనుంది. గత రీ-రిలీజ్ సమయంలో దేశవ్యాప్తంగా రూ. 15 కోట్లు వసూలు చేయగా, హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌లో మాత్రమే రూ. 69 లక్షల గ్రాస్ సాధించి రికార్డు సృష్టించింది.

PCX థియేటర్‌లో మొదటి రీ-రిలీజ్ సమయంలో 23,435 మంది ప్రేక్షకులు సినిమాను థియేటర్‌లో అనుభవించారు. ఇక మార్చి 14-20 షోలు కోసం ఇప్పటికే 4,000 టిక్కెట్లు అమ్ముడైపోయాయి. టికెట్ అమ్మకాలు వేగంగా పెరుగుతుండటంతో ఈసారి రీ-రిలీజ్ వసూళ్లు మరింత పెరిగే అవకాశముంది. IMAX ఫార్మాట్ అందుబాటులో లేకపోయినా, సినిమా ప్రాముఖ్యత, క్రేజీ కంటెంట్ కారణంగా ప్రేక్షకులు భారీగా థియేటర్లకు వెళ్లుతున్నారు.

మెథ్యూ మకానహే, అన్నే హాతవే, జెస్సికా చాస్తైన్, బిల్ ఇర్విన్, ఎలెన్ బర్స్టిన్, మైఖేల్ కేన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా, హాన్స్ జిమ్మర్ అందించిన మైమరపించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఇప్పటికీ టైమ్‌లెస్ క్లాసిక్‌గా నిలిచింది.

అంచనాలు అందుకున్న ఇంటర్స్టెల్లార్ మరోసారి థియేటర్లలో విజృంభించేందుకు సిద్ధమవుతోంది!

Read More

One thought on “‘ఇంటర్స్టెల్లార్’ రీ-రిలీజ్ సంచలనం – మరోసారి థియేటర్లలో గ్రాండ్ రన్!

Comments are closed.