‘పుష్ప 2’తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన తదుపరి సినిమాను స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్‌లు నటించనున్నారని, అల్లు అర్జున్ వారితో రొమాన్స్ చేయబోతున్నాడని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అట్లీ స్టైల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతుందని, అందులో అల్లు అర్జున్ ఎనర్జీ, స్టైల్ మరింత కొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్, గ్రాండ్ మేకింగ్‌తో రూపొందనున్న ఈ సినిమాలో టాప్ టెక్నీషియన్లు పని చేయబోతున్నారు. ఇప్పటికే ‘పుష్ప 2’లో తన అద్భుతమైన నటనతో అందరిని మెప్పించిన బన్నీ, అట్లీతో కలిసి మరొక ఇండస్ట్రీ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు.
మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి!

One thought on “అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో బిగ్ బడ్జెట్ సినిమా.. ఐదుగురు హీరోయిన్లతో రొమాన్స్!”
Comments are closed.