మలయాళ సినిమానే నన్ను సూపర్ స్టార్ చేసింది: మోహన్‌లాల్

Mohanlal

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నాలుగు దశాబ్దాలుగా ఆయన ఇండస్ట్రీలో అగ్రస్థానాన్ని కాపాడుకుంటూ, విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. సాధారణ నటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన మోహన్‌లాల్, తన టాలెంట్‌తో మలయాళ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, “నాకు ఈ స్థాయి గుర్తింపు రావడానికి కారణం మలయాళ చిత్ర పరిశ్రమే. ఇక్కడి సినిమాల వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నాను. మలయాళ ప్రేక్షకులు ఎప్పుడూ బలమైన కథలు, అద్భుతమైన కథనాన్ని అభినందిస్తారు. అందుకే ఇతర భాషల్లో అవకాశాలు వచ్చినా, మలయాళ ఇండస్ట్రీని వదిలిపెట్టాలనే ఆలోచనే రాలేదు,” అని అన్నారు.

మోహన్‌లాల్ పలు ఇతర భాషా సినిమాల్లో కూడా నటించారని, కానీ మలయాళ పరిశ్రమలో కొనసాగడమే ఆయనకు ముఖ్యమని తెలిపారు. టెక్నికల్‌గా కూడా మలయాళ ఇండస్ట్రీ అత్యున్నత ప్రమాణాలను పాటిస్తుందని, అందుకే ఇక్కడ గొప్ప సినిమాలు పుడుతున్నాయని చెప్పారు.

ప్రస్తుతం మోహన్‌లాల్ నటించిన ఎల్2 ఎంపురాన్ చిత్రం మార్చి 27న విడుదల కానుంది. ఇది సూపర్ హిట్ లూసిఫర్ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతోంది.

Read More