ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్ర సృష్టించిన యువ భారత్

ఇంగ్లండ్ గడ్డపై యువ భారత జట్టు చరిత్ర సృష్టించింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరిగిన ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ రెండో టెస్టులో టీమిండియా 336 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన బ్యాటింగ్, యువ పేసర్ ఆకాశ్ దీప్ మెరుపు బౌలింగ్‌తో భారత జట్టు తన అద్భుత సామర్థ్యాన్ని చాటింది. ఈ గెలుపుతో సిరీస్‌ను 1-1తో సమం చేయడమే కాకుండా, ఎడ్జ్‌బాస్టన్‌లో తొలిసారిగా భారత్ టెస్టు విజయం నమోదు చేయడం విశేషం. భారత్ విజయంపై క్రికెట్ ప్రముఖుల నుంచి ప్రశంసల వెల్లువ వెళ్లింది. గిల్ ఇన్నింగ్స్‌ను సచిన్ టెండూల్కర్ “అద్భుతం”గా అభివర్ణించగా, ఆకాశ్ దీప్ వేసిన బంతిని “బాల్ ఆఫ్ ద సిరీస్”గా కొనియాడాడు. బౌలింగ్‌లో జో రూట్‌ను ఆకాశ్ ఔట్ చేసిన తీరు విమర్శకులను ఆకట్టుకుంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, గిల్ నాయకత్వం, సిరాజ్ మరియు ఆకాశ్ దీప్ బౌలింగ్‌పై ప్రశంసలు కురిపించాడు.

యువరాజ్ సింగ్ మాట్లాడుతూ, “ఈ విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. గిల్ ఎంతో పరిణతి చూపాడు, ఆకాశ్ దీప్ ధైర్యంగా బౌలింగ్ చేశాడు” అని చెప్పాడు. ఐసీసీ ఛైర్మన్ జై షా, భారత క్రికెట్ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా భారత జట్టు పోరాట స్పూర్తిని కొనియాడారు. ఈ విజయంతో జూలై 10 నుంచి లార్డ్స్‌లో ప్రారంభమయ్యే మూడో టెస్టుపై అభిమానులలో భారీ ఆసక్తి నెలకొంది. సిరీస్‌ను కైవసం చేసేందుకు ఇరు జట్లు పోటీపడనున్నాయి.

Read More : మళ్లీ ముదిరిన షమీ-హసీన్ వివాదం

One thought on “ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్ర సృష్టించిన యువ భారత్

Comments are closed.