భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. విరాట్ కోహ్లీ తనను ‘ఈ సాలా కప్ నమ్దే’ అనే నినాదాన్ని ఇకపై వాడకూడదని కోరారని డివిలియర్స్ చెప్పారు.
ఈ సందర్భంగా డివిలియర్స్ మాట్లాడుతూ, “ఒక సందర్భంలో నేను ‘ఈ సాలా కప్ నమ్దే’ (Ee Sala Cup Namde) అని వ్యాఖ్యానించాను. అది బయటకు వచ్చిన వెంటనే విరాట్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. ఆ నినాదాన్ని ఇకపై ఉపయోగించవద్దని అతను నన్ను కోరాడు” అని వెల్లడించారు.
‘ఈ సాలా కప్ నమ్దే’ అంటే ‘ఈ సారి కప్పు మాదే’ అనే అర్ధం వచ్చే ఈ నినాదం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానుల మద్య ఎంతో పాపులర్ అయ్యింది. ఐపీఎల్ సీజన్ సందర్భంగా ఈ నినాదం తరచుగా వినిపించేది. అయితే ఈ మాటను పలికితే ఆ జట్టుపై అనవసర ఒత్తిడి పెరుగుతుందని భావించి విరాట్ కోహ్లీ ఇలా సూచించినట్టు తెలుస్తోంది.
డివిలియర్స్ ఈ విషయాన్ని వెల్లడించగానే ఆర్‌సీబీ అభిమానుల్లో ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. క్రీడా విశ్లేషకులు కూడా దీనిపై తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

One thought on “విరాట్ కోహ్లీ విజ్ఞప్తి.. ‘ఈ సాలా కప్ నమ్దే’ నినాదం వద్దని ఏబీ డివిలియర్స్‌కు సూచన”
Comments are closed.