పరుగెత్తుతున్న రైలులో తొలి ఏటీఎం పరీక్ష విజయవంతం..

భారతీయ రైల్వేలు సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాయి. పరుగెత్తుతున్న రైలులో తొలిసారిగా ఏటీఎం సేవను పరీక్షించడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మహారాష్ట్రలో మన్‌మాడ్ – ముంబై మార్గంలో నడిచే పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ఈ సేవను ప్రయోగాత్మకంగా అమలు చేశారు.

పరీక్షలో ఏటీఎం వ్యవస్థ సమర్థవంతంగా పని చేసినప్పటికీ, రైలు నెట్‌వర్క్‌ లేకపోయే ప్రాంతాల ద్వారా ప్రయాణించిన సమయంలో స్వల్ప సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ, ఈ ప్రయోగం రైల్వే రంగంలో ఒక కీలకమైన ముందడుగుగా భావిస్తున్నారు.

భవిష్యత్తులో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలిగించే విధంగా ఈ సేవను అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ యోచిస్తోంది.

Read More : జపాన్ ఇండియాకు ఉచితంగా E5, E3 శింకాన్స్‌ఎన్ ట్రైన్లు.