వక్ఫ్ సవరణ బిల్లుపై బీజేపీకి పార్లమెంట్‌లో సరిపడ మద్దతు లేకపోయినప్పటికీ, ఆ బిల్లుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్‌లు స్పష్టంగా మద్దతు ఇచ్చారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు.
ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన తరువాత ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు నిశ్శబ్దంగా కూర్చున్నారంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ చట్టం-2025కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు ఉద్రిక్తంగా మారడంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాత్ర ఉందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు.
ఇది యాదృచ్ఛికంగా తలెత్తిన హింసకాకుండా, పద్ధతి ప్రకారం నాటకీయంగా ముందుగానే రాబోయే హింసాత్మక సంఘటనల మాదిరిగా అమలు చేయబడిందని మమత ఆరోపించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె, అమిత్ షా — బీఎస్ఎఫ్‌తో కలిసి కుట్రపూరితంగా బంగ్లాదేశీయులను రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేశారని సంచలన ఆరోపణ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను దర్యాప్తు సంస్థల ద్వారా బెదిరించే కుట్రల్లో నిమగ్నమై ఉందని మండిపడిన మమత, దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హస్తక్షేపించి హోంశాఖ మంత్రిని నియంత్రించాలని డిమాండ్ చేశారు.
Read More : పరుగెత్తుతున్న రైలులో తొలి ఏటీఎం పరీక్ష విజయవంతం..

2 thoughts on “వక్ఫ్ బిల్లుపై మమత సంచలన ఆరోపణలు: చంద్రబాబు, నితీశ్ మద్దతు..”
Comments are closed.