ముంబై విమానాశ్రయంలో సోమవారం ఉదయం ఘటించిన ఘటనలో ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. కొచ్చి నుంచి ముంబైకి వస్తున్న ఎయిరిండియా విమానం (ఫ్లైట్ నెంబర్ AI-681), భారీ వర్షానికి రన్వే పై ల్యాండ్ అవుతుండగా జారిపోయింది. విమానంపై ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. విమానం జారిపడిన అనంతరం సిబ్బంది చాకచక్యంగా స్పందించి విమానాన్ని సురక్షితంగా ఆపగలిగారు. అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటన తర్వాత ప్రయాణికులను శీఘ్రంగా విమానం నుంచి దిగిపోవాలని సూచించడంతో వారు భయంతో బయటకు పరుగులు తీశారు.
ఈ ఘటనపై స్పందించిన ఎయిర్ ఇండియా అధికారులు… ముంబైలో ఆ సమయంలో కురిసిన భారీ వర్షం కారణంగా రన్వే తడిగా ఉండటం వల్లే ఈ ఘటన జరిగిందని తెలిపారు. పైలట్ అనుభవంతో ప్రమాదాన్ని నియంత్రించగలిగాడని స్పష్టం చేశారు. ఘటనపై విచారణ జరుగుతోందని వెల్లడించారు. ప్రస్తుతం విమానాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. అన్ని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు.
Read More : ముడా వివాదం: సుప్రీంకోర్టు తిప్పికొట్టింది

One thought on “ముంబై రన్వే పై తృటిలో తప్పిన ప్రమాదం”
Comments are closed.