ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై క్వాలిటీ విమర్శలు.. కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఇదే!

Kalyan Ram responds to Devara criticism

నందమూరి కళ్యాణ్ రామ్ స్వంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి ‘దేవర’ సహా పలు హిట్ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ సంస్థలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘జై లవకుశ’, ‘దేవర’ వంటి భారీ సినిమాలు తెరకెక్కాయి. అయితే హీరోల సొంత నిర్మాణ సంస్థలపై ప్రేక్షకులు, అభిమానుల్లో ఎక్కువ అంచనాలు ఉండే సందర్భంలో, ఎన్టీఆర్ ఆర్ట్స్ మాత్రం అప్పుడప్పుడు విమర్శలకు గురవుతోంది. ముఖ్యంగా ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో తగిన ప్రమాణాలు ఉండడం లేదని కొంతమంది అభిమానులే సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవలి కాలంలో ‘దేవర’ చిత్రం విడుదలైనపుడు కూడా ఇదే తరహా విమర్శలు వినిపించాయి. విడుదలకు ముందు కళ్యాణ్ రామ్ “గేమ్ ఆఫ్ థ్రోన్స్‌ మించిన వరల్డ్‌ను క్రియేట్ చేస్తున్నాం” అని చెప్పినప్పటికీ, విడుదల అనంతరం ప్రేక్షకులందరికీ ఆ స్థాయిలో విజువల్స్ అనిపించలేదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో, సహ నిర్మాత హరికృష్ణపై అభిమానులు అసంతృప్తిగా స్పందించడంతో పాటు, చిత్ర నిర్మాణ ప్రమాణాలను ప్రశ్నించారు.

ఈ విమర్శలపై కళ్యాణ్ రామ్ తాజాగా స్పందిస్తూ, తాను నెగెటివ్ కామెంట్లను పట్టించుకోనని స్పష్టం చేశాడు. “మన సంస్థ పేరు చెడేలా మేమే ఎందుకు వ్యవహరిస్తాం? నిజంగా ‘దేవర’లో క్వాలిటీ తగ్గి ఉంటే తారక్ ఊరుకుంటాడా?” అని ప్రశ్నించాడు. సముద్ర నేపథ్యంలో ఎక్కువ భాగం సినిమా ఉండడం వల్లే ఆ విజువల్స్ ప్రత్యేకంగా ఉంటాయని, తెలుగులో ఇంతవరకూ చూడని స్కేల్‌లో ఈ సినిమా తెరకెక్కిందని పేర్కొన్నాడు. నెగెటివ్ వ్యాఖ్యల్ని పక్కన పెట్టి ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండాలనే ధ్యేయంతోనే తాను ముందుకెళ్తానని కళ్యాణ్ రామ్ తెలిపారు.

Read More

One thought on “ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై క్వాలిటీ విమర్శలు.. కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఇదే!

Comments are closed.