కుబేర నుంచి ఫస్ట్ సింగిల్.. ధనుష్ సాంగ్‌కు భారీ రెస్పాన్స్

Kubera First Single Promo

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘కుబేర’ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదలైంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై సునీల్ నారంగ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ధనుష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా కనిపించనున్నారు. ఇక కీలక పాత్రలో నాగార్జున నటిస్తుండగా, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అందించిన ‘పొయ్ రా మామా..’ అనే సాంగ్ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.2

ఈ సాంగ్‌ను హీరో ధనుష్ స్వయంగా ఆలపించగా, శేఖర్ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రోమో రిలీజ్‌తో పాటపై మంచి బజ్ ఏర్పడింది. ధనుష్ పర్ఫార్మెన్స్, శేఖర్ కమ్ముల స్టైల్ మేకింగ్‌తో కలిసి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగార్జున పాత్ర కూడానూ ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇవ్వనుందని టాక్.

‘కుబేర’ సినిమాతో పాటు ధనుష్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘ఇడ్లీ కొడై’ అనే ప్రాజెక్ట్ కూడా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ‘రాయన్’తో సూపర్ హిట్ అందుకున్న ధనుష్, ఈ చిత్రంతో మరో హిట్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాడు. తెలుగు, తమిళంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ పోస్టర్స్ ఇప్పటికే భారీ హైప్‌ క్రియేట్ చేశాయి. ధనుష్-నాగార్జున-రష్మిక కాంబినేషన్‌తో వస్తున్న ఈ సినిమా నిజంగానే ప్రత్యేకంగా నిలిచే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Read More

One thought on “కుబేర నుంచి ఫస్ట్ సింగిల్.. ధనుష్ సాంగ్‌కు భారీ రెస్పాన్స్

Comments are closed.