తిరువనంతపురంలో బ్రిటన్ ఎఫ్-35బి హస్తాంతరం

కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో మూడు వారాలుగా టార్మాక్‌పై నిలిచిపోయిన బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన అత్యాధునిక ఎఫ్-35బి స్టెల్త్ ఫైటర్ జెట్‌ను ఎట్టకేలకు హ్యాంగర్‌కు తరలించారు. ఎగరడానికి మొండికేసిన ఈ విమానాన్ని టోయింగ్ వాహనం సహాయంతో లాక్కెళ్లారు. ఇటీవల సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ విమానం తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌కి దిగినప్పటినుంచి అక్కడే నిలిచిపోయింది. అప్పటి నుంచి బ్రిటన్ టెక్నీషియన్లు ఎఫ్-35బి జెట్ మరమ్మతులపై కసరత్తు చేస్తున్నారు. తాజాగా బ్రిటన్ నుంచి ఎయిర్‌బస్ ఏ400ఎం అట్లాస్ ద్వారా వచ్చిన ఇంజనీర్ల బృందం ఈ జెట్‌ను మరమ్మతు చేయడం సాధ్యమవుతుందా లేక విడిభాగాలుగా విడదీసి సి-17 గ్లోబ్‌మాస్టర్ సైనిక రవాణా విమానంలో స్వదేశానికి తరలించాలా అనే విషయంలో నిర్ణయం తీసుకోనుంది.

సుమారు 110 మిలియన్ డాలర్లు విలువ చేసే ఈ యుద్ధవిమానంలో అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీ ఉంది. ఇది శత్రు రాడార్లకు కనిపించకుండా ఉండే సాంకేతికతతో రూపొందించబడింది. ఈ టెక్నాలజీ లీక్ కాకుండా ఉండేందుకు భద్రతా చర్యలపై బ్రిటన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఒక్కో విడిభాగానికి సెక్యూరిటీ కోడ్ కేటాయించి, ప్రతి కదలికను రికార్డ్‌ చేస్తారు.

ఇలాంటి తరలింపులు ఇదే తొలిసారి కాదు. 2019లో అమెరికాలో ఓ ఎఫ్-35 జెట్‌ను కూడా ఈ విధంగా విడదీసి సి-17 ద్వారా రవాణా చేసిన ఘటన ఉంది.

Read More : August 1 : అధిక సుంకాల అమలుపై అమెరికా గడువు

One thought on “తిరువనంతపురంలో బ్రిటన్ ఎఫ్-35బి హస్తాంతరం

Comments are closed.