ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్..

ఐసీసీ సోమవారం విడుదల చేసిన పురుషుల క్రికెట్ వార్షిక ర్యాంకింగ్స్‌లో భారత్ వైట్ బాల్ ఫార్మాట్లలో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. వన్డే, టీ20లలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న టీమిండియా, టెస్టుల్లో మాత్రం నాలుగో స్థానానికి పడిపోయింది.

వన్డేల్లో అగ్రస్థానం భారత్‌దే
ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ విజయం భారత్‌కు వన్డే ర్యాంకింగ్స్‌లో బలాన్ని ఇచ్చింది. భారత్‌ రేటింగ్ పాయింట్లు 122 నుంచి 124కు పెరిగి మొదటి స్థానంలో నిలిచింది. రన్నరప్ న్యూజిలాండ్‌ రెండో స్థానంలో కొనసాగుతుండగా, ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది.

టీ20ల్లోనూ భారత్‌కి మొదటి స్థానం
టీ20 ర్యాంకింగ్స్‌లోనూ భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా రెండో స్థానం దక్కించుకోగా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లు వరుసగా మూడో నుంచి ఐదో స్థానాల్లో ఉన్నాయి.

టెస్టుల్లో భారత్ వెనుకంజలో
రెడ్ బాల్ ఫార్మాట్ అయిన టెస్టుల్లో భారత్ నాలుగో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా మాత్రం 126 పాయింట్లతో అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. బెన్ స్టోక్స్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టు రెండో స్థానానికి ఎగబాకింది. ఈ జట్టు ఏడాదిలో ఆడిన నాలుగు టెస్టుల్లో మూడింటిలో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా 111 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, టీమిండియా 105 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.

Read More : ఐపీఎల్ మైదానాల్లో ‘పెద్ది’ హంగామా