టెక్ ప్రపంచంలో చర్చనీయాంశం

టెస్లా సీఈఓ, ఎక్స్‌ అధినేత ఎలాన్ మస్క్ తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో పేరును ‘ఎలాన్ మస్క్’ నుంచి ‘గోర్క్ లాన్ రస్ట్’గా మార్చారు. దీంతో టెక్ వర్గాల్లో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి.

ఈ కొత్త పేరులో ‘గ్రాక్’ అనే పదం మస్క్ ఏఐ కంపెనీ xAI రూపొందించిన చాట్‌బాట్‌కు, ‘రస్ట్’ అనే పదం ఆ సంస్థ వాడుతున్న ప్రోగ్రామింగ్ భాషకు సంబంధించినదిగా భావిస్తున్నారు. అంతేకాదు, ‘గోర్క్ లాన్ రస్ట్’ పేరిట సోలానా బ్లాక్‌చెయిన్‌లో ఓ మీమ్ కాయిన్ కూడా చలామణిలో ఉండటంతో, దీనికి ప్రచారం కల్పించేందుకే ఆయన ఈ పేరు మార్చి ఉంటారన్న ఊహాగానాలు ఉన్నాయి.

ఇటీవలే మస్క్, ‘గ్రాక్’ ఆధారిత ఫీచర్లు ఎక్స్‌లో చేర్చనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే పేరు మార్పు కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎప్పుడూ వినూత్నంగా, అసాధారణంగా వ్యవహరించే మస్క్, ఈసారి కూడా టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.

Read More : AI : రోజువారీ పనుల్లో విప్లవాత్మక మార్పు