గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ఊరట కలిగించే విధంగా ‘పెద్ది’ సినిమా గ్లింప్స్ ఇప్పుడు క్రికెట్ మైదానాల్లో కూడా సందడి చేస్తోంది. ఐపీఎల్ టీం ఢిల్లీ క్యాపిటల్స్ తాజా వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది.
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’ గ్లింప్స్‌కు నేపథ్యంగా ఉన్న పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను వినూత్నంగా వినియోగిస్తూ, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఓ స్పెషల్ వీడియోను రూపొందించింది. ఈ వీడియోలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో యువ క్రికెటర్ సమీర్ రిజ్వీ, రామ్ చరణ్ కొట్టిన స్టైల్ షాట్‌ను మైదానంలో అద్దంలా పునఃసృష్టించడం విశేషం.
ఈ క్రియేటివ్ వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేయగా… అది కాస్తా వైరల్ అయింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ వీడియోను పెద్ద ఎత్తున షేర్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ హైలైట్ చేస్తున్నారు.
ఇటీవలే రిలీజ్ అయిన ‘పెద్ది’ గ్లింప్స్‌కు ఇప్పటికే రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తుండగా, ఇప్పుడు ఆ గ్లింప్స్ క్రికెట్ వీడియోలో వినిపించడంతో ఫ్యాన్స్ హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ గ్లామర్, సినిమాల క్రేజ్ క్రికెట్ మైదానాలకు కూడా విస్తరించడంతో, ‘పెద్ది’ సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి.
సినిమా-క్రికెట్ కలయికలో వచ్చిన ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి!
Read More : కౌంటీ చాంపియన్‌షిప్‌లో షాకింగ్ ఘటన

One thought on “ఐపీఎల్ మైదానాల్లో ‘పెద్ది’ హంగామా”
Comments are closed.