రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎందుకంటే..? జయవర్ధనే వివరణ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL ) 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు, టీమిండియా టెస్ట్ & వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఎక్కువగా ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఫిట్‌గా ఉన్నా ఫీల్డింగ్‌కు ఎందుకు ఉపయోగించడంలేదన్న చర్చలు ఊపందుకున్నాయి. తాజాగా ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే దీనిపై క్లారిటీ ఇచ్చారు.

గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జయవర్ధనే మాట్లాడుతూ – “రోహిత్‌ను ఇంపాక్ట్ సబ్‌గా తీసుకోవాలనే నిర్ణయం ముందు నుంచే తీసుకోలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా అతనికి స్వల్ప గాయం అయింది. అందుకే మళ్లీ పూర్తిగా ఫిట్ అయ్యే వరకు అతనిపై ఎక్కువ భారం వేయకూడదని నిర్ణయించుకున్నాం. బ్యాటింగ్ అతనికి కీలకం కాబట్టి దానికే ప్రాధాన్యం ఇచ్చాం,” అని తెలిపారు.

అలాగే జట్టు వ్యూహాలు, మైదాన పరిస్థితులు కూడా దీనికి కారణమని చెప్పారు. “మా జట్టులో చాలామంది ఆటగాళ్లు ఆల్‌రౌండర్లు. కొన్ని స్టేడియాల్లో బౌండరీల వద్ద వేగంగా పరిగెత్తగల ఫీల్డర్లు అవసరం. అందుకే స్పీడ్, యథాశక్తి అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటున్నాం” అని వివరించారు.

Read More : ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్..