హైదరాబాద్‌లో మరో ఆన్‌లైన్ మోసం వెలుగుచూసింది. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌కి వాహన చలానా పేరిట పంపిన ఫేక్ లింక్ వల్ల ఆయన రూ.1.2 లక్షలు కోల్పోయారు. వాట్సాప్ ద్వారా ఒక లింక్ పంపిన దుండగులు, “మీ వాహనానికి చలానా ఉంది.. వెంటనే చెల్లించండి” అంటూ అతన్ని బురిడిలో పడేశారు. లింక్ ద్వారా ఓ యాప్ డౌన్‌లోడ్ చేయాల్సిందిగా సూచించడంతో, ఆర్మీ రిటైరీ అనుమానించకుండా యాప్‌ను ఇన్‌స్టాల్ చేశారు. ఆ యాప్ ద్వారా అతని క్రెడిట్ కార్డ్ వివరాలు హ్యాకర్లు దొంగిలించి భారీగా ఖర్చులు చేశారు. మోసాన్ని గుర్తించిన వెంటనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ప్రస్తుతం ఈ ఘటనపై సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని లింక్స్‌పై క్లిక్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు.
Read More : కూకట్‌పల్లిలో కల్తీ కల్లు కలకలం

2 thoughts on “ఆర్మీ ఆఫీసర్‌కు ఆన్‌లైన్ మోసం…”
Comments are closed.