త్వరలో 150 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి

హైదరాబాద్ వాసులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) శుభవార్త చెప్పింది. నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని, త్వరలోనే 200 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. వీటిలో సుమారు 150 బస్సులు ఎలక్ట్రిక్ వాహనాలే కావడం గమనార్హం.

ప్రత్యేకించి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమయ్యే సమయానికి ఈ బస్సులు సేవలు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్టు సమాచారం. ప్రస్తుతం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో బస్సుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. ఆక్యుపెన్సీ రేటు 95 నుంచి 100 శాతానికి చేరుకోవడంతో, రద్దీని తగ్గించడానికి మరియు మరింత మందిని ఆకర్షించేందుకు కొత్త బస్సుల అవసరం ఏర్పడిందని అధికారులు తెలిపారు.

ఇటీవల తీసుకున్న నిర్ణయం ప్రకారం, మొదటిగా 200 బస్సులను జూలైలోనే అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని తరువాతి దశలో 2025 నాటికి దాదాపు వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్‌లో నడపాలని తెలంగాణ ఆర్టీసీ యోచిస్తోంది.

ఎలక్ట్రిక్ బస్సులు వాడటం వల్ల ప్రయాణికులకు మరింత సౌకర్యం లభించడమే కాకుండా, నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.

Read More : రాహుల్ గాంధీ పర్యటనపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

One thought on “త్వరలో 150 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి

Comments are closed.