తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట ప్రాంతంలో భద్రతా దళాలు భారీ ఎన్‌కౌంటర్ నిర్వహిస్తున్నాయి. ఈ ఆపరేషన్‌లో దాదాపు 38 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.
కర్రెగుట్ట ప్రాంతాన్ని మూడువైపులా చుట్టుముట్టిన భద్రతా దళాలు, హెలీకాప్టర్లు, డ్రోన్లు, శాటిలైట్ పర్యవేక్షణతో మావోయిస్టులపై పైనుంచి బాంబుల వర్షం కురిపించారు. అధునాతన ఆయుధాలతో భారీ కాల్పులు జరిపారు.
మావోయిస్టుల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడానికి దాదాపు 10,000 మంది భద్రతా బలగాలను దింపినట్లు గుర్తించారు. భారీ బందోబస్తుతో కొనసాగుతున్న ఈ ఆపరేషన్ కర్రెగుట్టలో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది.
Read More : గంభీరావుపేటలో దారుణ ఘటన

One thought on “తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్”
Comments are closed.