హైదరాబాద్ అంబర్‌పేటలో శృంగార లైవ్ స్ట్రీమింగ్ స్కాం బయటపడింది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఓ దంపతులు తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నారు. లైంగిక కార్యకలాపాలను మొబైల్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఆదాయం పొందేందుకు ప్రయత్నించారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. మల్లికార్జున నగర్‌లో నివసించే 41ఏళ్ల వ్యక్తి, అతని 37ఏళ్ల భార్య కలిసి ఈ దందాలో పాల్గొన్నారు. వృత్తిరీత్యా క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్న ఈ వ్యక్తి, భార్య సహకారంతో ఓ యాప్ ద్వారా యువతను లక్ష్యంగా చేసుకుని లైవ్ వీడియోలు, రికార్డ్ చేసిన క్లిప్‌లు విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. లైవ్ వీడియో వీక్షణానికి రూ.2000, రికార్డ్ క్లిప్‌కు రూ.500 వసూలు చేసినట్లు గుర్తించారు. ఇందుకోసం వారు హెచ్‌డీ కెమెరాలను ఉపయోగించగా, స్ట్రీమింగ్ సమయంలో తమ ముఖాలను మాస్కులతో కప్పేవారని పోలీసులు వెల్లడించారు. ఈ అక్రమ ఆదాయం క్యాబ్ డ్రైవింగ్‌తో వచ్చే ఆదాయాన్ని మించిపోయిందని దంపతులు అంగీకరించారు. పోలీసులకు వచ్చిన సమాచారంతో ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ బృందాలు దాడి నిర్వహించి, కెమెరాలు సహా పరికరాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ కేసులో ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటన వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో ఇటువంటి దుర్వినియోగాలపై అధికారులు నిఘా పెట్టి, బాధ్యతారాహిత్యంతో వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
Read More : మంత్రి సీతక్కపై మావోయిస్టుల హెచ్చరిక లేఖ

2 thoughts on “లైవ్ స్ట్రీమింగ్ శృంగార రాకెట్: దంపతుల అరెస్ట్”
Comments are closed.