హైదరాబాద్ నగరంలో మురుగు నీరు సరఫరా చేస్తున్న ఘటనపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాపు నగర్, లంగర్ హౌస్ ప్రాంతాల్లో మంచినీటి బదులుగా మురుగు నీరు వాసనతో కలిసి పైపుల్లో నుంచి వచ్చేస్తుండటంతో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తాగునీటిని వాడే పరిస్థితి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ సమస్యపై స్పందించిన స్థానికులు, “మా పిల్లలకు కూడా నీరు తాగించలేని పరిస్థితి. ఎంతసేపు బట్టల్ని ఉతికే నీరుకూడా కడగాలి” అని వాపోయారు. HMWSSB (హైదరాబాద్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు) అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ ప్రాంతాల ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. అధికారులు విచారణ చేసి, సమస్యను త్వరగా పరిష్కరించకపోతే నిరసనలు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది.
Read Mode : పెద్దపల్లిలో పసికూనపై యువకుడి అత్యాచారయత్నం

One thought on “హైదరాబాద్‌లో మంచినీటి బదులుగా మురుగు నీరు! స్థానికులు ఆగ్రహం”
Comments are closed.