సాహో చిత్రంలో పోలీస్ అధికారిణిగా నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈవ్ లిన్ శర్మ మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. శ్రద్ధా కపూర్, జాక్విలిన్ ఫెర్నాండెజ్, మదిరా బేడి వంటి భామలతో పాటు ఈవ్ లిన్ పోలీస్ అధికారిణి పాత్రలో హాట్ అండ్ సీరియస్ లుక్‌లో కనిపించి మంచి గుర్తింపు పొందింది. నీల్ నితిన్ ముఖేష్ సహచరుడిగా ‘వాజీ నగరం’ స్పెషల్ వింగ్ పోలీసాఫీసర్‌గా ఆమె పాత్ర చక్కగా వినిపించింది.

అయితే రియల్ లైఫ్‌లో మాత్రం ఈవ్ లిన్ చాలా బోల్డ్. ఇప్పటికే పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లి అయినా, ఆమె గ్లామర్‌కు మాత్రం మినహాయింపు లేదు. తాజాగా ఆమె చేసిన రెడ్ హాట్ ఫోటోషూట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. “అమ్మతనానికి ముందు ఇలా ఉండేదాన్ని… ఇప్పుడీ జ్ఞాపకాన్ని తిరిగి తెచ్చుకుంటున్నా” అంటూ షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

బాలీవుడ్‌లో ‘ఏ జవానీ హై దివానీ’, ‘యారియాన్’ వంటి చిత్రాల్లో నటించినా స్టార్‌హెడ్ అందుకోలేకపోయిన ఈవ్ లిన్, ప్రస్తుతం రీ ఎంట్రీకి రెడీ అవుతోంది. తుషాన్ అనే ఆస్ట్రేలియన్ డాక్టర్‌ను వివాహం చేసుకున్న ఈ భామ ఇప్పుడు తల్లి అయినా, తన కెరీర్‌ను మళ్లీ తిరిగి బలోపేతం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సిగ్నల్స్ పంపుతూ, గ్లామర్‌తో హీటు పెంచుతోంది.

One thought on “సౌత్ డైరెక్టర్లకు గ్లామర్ సిగ్నల్స్ పంపిన ఈవ్ లిన్”
Comments are closed.