వరంగల్ జిల్లా హనుమకొండలో బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన సిల్వర్ జూబ్లీ సమావేశంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సభ నిర్వహణకు పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో బీఆర్‌ఎస్ హైకోర్టును ఆశ్రయించగా, శుక్రవారం దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం, అనుమతి అంశంపై ఏప్రిల్ 17 లోపు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అలాగే వరంగల్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
బీఆర్‌ఎస్ తరఫున న్యాయవాది వాదిస్తూ, అనుమతికి ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడం వల్లే పిటిషన్ వేయాల్సి వచ్చిందని తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు సమాధానం ఇస్తూ… సభ అనుమతి విషయాన్ని పరిశీలిస్తున్నామని, వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
తద్వారా హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. బీఆర్‌ఎస్ పార్టీ ఏప్రిల్ 27న హనుమకొండలోని ఎల్కతుర్తిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 వరకు సభ నిర్వహించాలని భావిస్తోంది. అనుమతి లభించకపోవడంతో కోర్టును ఆశ్రయించింది. సభపై అనుమతిని ఎప్పటికైనా 17లోపు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు అధికారులకు స్పష్టం చేసింది.
Read More : హైదరాబాద్‌లో మంచినీటి బదులుగా మురుగు నీరు! స్థానికులు ఆగ్రహం

One thought on “బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ సభపై హైకోర్టు కీలక ఆదేశాలు..”
Comments are closed.