సీఐడీ అధికారులు ఉప్పల్ స్టేడియంలో సీన్ రీ కన్‌స్ట్రక్షన్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అక్రమాల కేసులో సీఐడీ విచారణ వేగంగా కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం సీఐడీ అధికారులు ఉప్పల్ స్టేడియంలో సోదాలు చేపట్టారు. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న ఏ1 నిందితుడు జగన్ మోహన్ రావుతో అధికారులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ నిర్వహిస్తున్నారు. హెచ్‌సీఏ కార్యాలయం వద్ద విచారణకు సంబంధించి నిఖిలంగా పరిశీలనలు జరుగుతున్నాయి. సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ కోసం జగన్ మోహన్ రావుతో పాటు ట్రెజరర్ శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్ కాంతే, శ్రీచక్ర క్లబ్ అధ్యక్షురాలు కవిత, క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్‌లను స్టేడియానికి తీసుకొచ్చారు. అనంతరం వారిని శ్రీచక్ర క్లబ్‌కి తరలించనున్నారు. ఇప్పటికే సీఐడీ అధికారులు ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశారు. కీలక నిందితుడిగా జగన్ మోహన్ రావు వ్యవహరించారని అధికారులు స్పష్టం చేశారు. గత రెండు సంవత్సరాల్లో బీసీసీఐ నుండి వచ్చిన రూ.170 కోట్ల నిధుల విషయంలో స్పష్టత లేకపోవడం, వాటి వినియోగంలో అనేక అనుమానాలు నెలకొనడంతోనే ఈ దర్యాప్తు జరుగుతోంది.

విచారణలో నకిలీ పత్రాలతో ఎన్నికలు, ఐపీఎల్ టికెట్లను పట్టించుకునే విధానం, బీసీసీఐ నిధుల గోల్‌మాల్ తదితర అంశాలపై దృష్టిసారించారు. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ ద్వారా నిందితుల పాత్రను స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు.

Read More : ఖమ్మంలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు: రేవంత్‌ ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారా?..