ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ప్రముఖ నాయకురాలు ఆర్.కే. రోజా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్‌తో పాటు రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ‘‘రూ. 2 వేలు ఇస్తే రోజా ఏ పనైనా చేసేదంటూ’’ ఎమ్మెల్యే భాను ప్రకాశ్ చులకనగా వ్యాఖ్యానించారని, తన గురించి అర్హతలేని, అవమానకరంగా మాట్లాడారనీ రోజా ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘రోజా వ్యాంప్ కు ఎక్కువ, హీరోయిన్ కు తక్కువ’’ అంటూ నీచమైన మాటలు మాట్లాడిన తీరు తీవ్రంగా కలచివేసిందని వెల్లడించారు.
‘‘ఇది వ్యక్తిగత దాడి మాత్రమే కాదు… అధికారాన్ని ప్రశ్నించే ధైర్యం ఉన్న ప్రతి మహిళపై జరిగే దాడి ఇది’’ అని రోజా అన్నారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా వ్యవహరించిన గాలి భాను ప్రకాశ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ‘‘రాష్ట్రంలో జరిగే అక్రమాలను ఎదిరించినందుకు ఇలా నిందించబడుతున్నా’’ అంటూ బాధ వ్యక్తం చేశారు. మహిళల స్వాభిమానం, హక్కులపై ఇలా దాడులు జరగడం ప్రమాదకరమైన సంస్కృతికి నిదర్శనమని ఆమె హెచ్చరించారు.
Read More : కేంద్రం నుంచి శాశ్వత పరిష్కారానికి కసరత్తు : DCM

One thought on “రోజా – భానుప్రకాశ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం”
Comments are closed.