కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని విచారణ కమిషన్ ముందు మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. సోమవారం జరిగిన ఈ విచారణలో గంటన్నరపాటు హరీష్ రావును కమిషన్ ప్రశ్నించింది. ఈ వ్యవధిలో ప్రాజెక్టు డిజైన్, పనుల నాణ్యత, ఆర్థిక వ్యయాలు, పతనమైన నిర్మాణాలపై సమగ్రంగా విచారణ సాగింది.
ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, ప్రాజెక్టుపై తన బాధ్యతలన్నింటిపై వివరాలు అందించినట్లు సమాచారం. ఇప్పటికే ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజ్‌లో లోపాలు ఉన్నాయని ఆయన పేర్కొన్న విషయం కమిషన్ దృష్టికి వచ్చినట్టు సమాచారం.
కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ రూపొందించిన ప్రశ్నావళి ఆధారంగా విచారణ కొనసాగిందని అధికారులు వెల్లడించారు. తాజా విచారణ అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి.
Read More : కాళేశ్వరం ప్రాజెక్టు పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ ప్రారంభం.

One thought on “గంటన్నరపాటు కొనసాగిన సుదీర్ఘ విచారణ”
Comments are closed.