మహారాష్ట్రలో జనవరి 29న జరిగిన మహా కుంభమేళా తొక్కిసలాటలో మరణించిన భక్తుల కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందించలేదని అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగు నెలలు గడుస్తున్నా బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించని యూపీ ప్రభుత్వ తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.
తొక్కిసలాట ఘటన అనంతరం మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించే ప్రక్రియలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాల పట్ల కనీస సానుభూతి కూడా చూపించకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించింది.
ఈ నేపథ్యంలో, మరణించిన భక్తుల పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని, ఆలస్యం చేయకుండా వెంటనే వారి కుటుంబాలకు పరిహారం అందించాలని యూపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణకు తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
Read More : సిక్కీంలో హనీమూన్ ప్రమాదం: ఉత్తరప్రదేశ్ దంపతులు గల్లంతి.

One thought on “మహాకుంభమేళా తొక్కిసలాటపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం”
Comments are closed.