హోటల్స్, షాపుల తరువాత ఇప్పుడు సినిమా ఫ్లెక్సీల వంతు వచ్చింది. కన్నడ భాష పోరాట నాయకులు మరోసారి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాజాగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ఫ్లెక్సీలు వారి కోపానికి గురయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే – ఈ సినిమా విడుదల సందర్బంగా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు వేశారు. అయితే వాటిలో కన్నడ భాష లేకపోవడంపై కన్నడ భాష పోరాట నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం తెలుగు భాషలో మాత్రమే బ్యానర్లు ఉండటం తమ భాష గౌరవానికి అవమానమని ఆరోపిస్తూ, ఆ ఫ్లెక్సీలను చించివేశారు. కన్నడ భాషను కర్ణాటకలో తప్పనిసరిగా ఉపయోగించాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న భాషా పోరాట నాయకులు, ఈ ఘటనపై సినిమా యూనిట్‌ను కూడా ప్రశ్నించే ప్రయత్నం చేశారు. “కర్ణాటకలో సినిమా ప్రచారం చేయాలంటే తప్పనిసరిగా కన్నడ భాషలోనూ ఫ్లెక్సీలు ఉండాలి. ఇది స్థానిక భాష గౌరవానికి సంబంధించిన అంశం” అని వారు హెచ్చరించారు.
ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఈ అంశం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Read More : రానాకు మరోసారి ఈడీ నోటీసులు .?

One thought on “హరిహర వీరమల్లు ఫ్లెక్సీలపై కన్నడ భాషా పోరాటం”
Comments are closed.