ములుగు జిల్లాలో మహాలక్ష్మి సంబురాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి సీతక్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె స్వయంగా ఆర్టీసీ ఉచిత బస్సులో ప్రయాణిస్తూ మహిళలతో మాట్లాడి, వారి అనుభవాలను తెలుసుకున్నారు. బస్టాండ్‌లో మహిళలకు స్వీట్లు తినిపించి ఆనందాన్ని పంచుకున్నారు. ఉచిత బస్సు సేవలను విజయవంతంగా అందిస్తున్న ఆర్టీసీ సిబ్బందిని మంత్రి సీతక్క ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంతో మహాలక్ష్మి సంబురాలు మరింత ఉత్సాహభరితంగా మారాయి.
Read More : మహిళలు రూ.6,680 కోట్లు ఆదా – భట్టి విక్రమార్క
