కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కాన్వాయ్ సమీపంలో మంగళవారం ద్రాస్‌లో విషాద ఘటన తప్పింది. రిజిజు కాన్వాయ్‌కు ముందుగా వెళ్తున్న ఒక వాహనం అదుపుతప్పి నదిలో పడిపోవడంతో ఇద్దరు ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. అయితే, వెంటనే స్పందించిన కేంద్రమంత్రి సిబ్బంది ఆ వాహనంలోని ఇద్దరినీ సురక్షితంగా బయటకు తీశారు. ఈ విషయాన్ని కిరణ్ రిజిజు స్వయంగా ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
“లడక్‌లోని ద్రాస్‌కు చేరుకునే ముందు మా కాన్వాయ్‌కి ముందున్న వాహనం నదిలో పడిపోయింది. అదృష్టవశాత్తూ, మా బృందం వెంటనే స్పందించడం వల్ల వాహనంలో ఉన్న ఇద్దరూ క్షేమంగా బయటపడ్డారు” అని ఆయన తన పోస్టులో తెలిపారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను కూడా రిజిజు ‘ఎక్స్’లో పంచుకున్నారు.
Read More : ఆపరేషన్ సిందూర్ కొనసాగుతూనే ఉంది.

One thought on “ద్రాస్‌లో ప్రమాదం: కిరణ్ రిజిజు సిబ్బంది ఇద్దరిని రక్షించారు”
Comments are closed.