ఇరాన్, కెనడా, హాంకాంగ్‌లో ‘హరిహర వీరమల్లు’ – గ్రాండ్ విజువల్ ట్రీట్

Hari Hara Veera Mallu VFX

పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ సోషియో ఫాంటసీ చిత్రం హరిహర వీరమల్లు మే 9న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. టాకీ పార్ట్ దాదాపు పూర్తవగా, పవన్ కళ్యాణ్ పై కొంతపాటు షూటింగ్ మిగిలి ఉంది. అయితే, ఈ చిత్రానికి భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ అవసరమయ్యే కారణంగా, గ్రాఫిక్స్ పనులను ముందుగా ప్రారంభించారు.

ఈ సినిమా సీజీ పనులు గ్లోబల్ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్, కెనడా, హాంకాంగ్‌లలో ప్రముఖ స్టూడియోల సహకారంతో గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. ఒకే కంపెనీకి ఈ బాధ్యతలు అప్పగించగా, సమాంతరంగా మూడు దేశాల్లో విభజించి పనులను పూర్తి చేయిస్తున్నారు. అలాగే, హైదరాబాద్, చెన్నై స్టూడియోలలో కూడా కొన్ని కీలక విజువల్ ఎఫెక్ట్స్ పనులు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఇంత భారీ స్థాయిలో సీజీ వర్క్ జరగడం ఇదే తొలిసారి.

పీరియాడిక్ కథ కావడంతో ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీలక పాత్ర పోషించనున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను అత్యద్భుతంగా మలచేందుకు ప్రత్యేకంగా విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ పనిచేస్తోంది. పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ప్రకారం మిగిలిన షూటింగ్ పూర్తి చేసిన వెంటనే, అవసరమైన సీజీ ఎఫెక్ట్స్ కూడా చివరి దశలోకి వెళ్లనున్నాయి. మే 9న విడుదల కాబోతున్న ఈ సినిమా, ప్రేక్షకులకు గ్రాండ్ విజువల్ ట్రీట్ అందించనుంది.

Read More

One thought on “ఇరాన్, కెనడా, హాంకాంగ్‌లో ‘హరిహర వీరమల్లు’ – గ్రాండ్ విజువల్ ట్రీట్

Comments are closed.