ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం: ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని 2వ బ్లాక్‌లో ఈ ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆయనతో కలిసి చీఫ్ సెక్రటరీ కేఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోం మంత్రి వనమా అనిత, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేశ్ కుమార్ మీనా కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ, ఈ ఘటనపై శాఖాపరమైన దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. బ్యాటరీ రూమ్ పూర్తిగా కాలిపోయిందని వెల్లడించారు. ఫైర్ అలారం పనిచేయకపోవడంపై విచారణ జరుగుతోందని తెలిపారు. ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు.

సచివాలయంలోని అన్ని బ్లాక్‌లను పూర్తిగా తనిఖీ చేసి, అగ్నిప్రమాదాల రక్షణ వ్యవస్థ ఎంతవరకూ సమర్థంగా ఉందో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆమె ఆదేశించారు. ముఖ్యమైన విభాగాలున్న 2వ బ్లాక్‌లో ఈ ప్రమాదం జరగడం ఆశ్చర్యకరమని మంత్రి అనిత అన్నారు.

Read More : ఏపీ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం

One thought on “ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం: ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు..

Comments are closed.