శ్రీరామనవమి వేడుకలు దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో రాముల వారి శోభాయాత్రలు సందడి చేశాయి. ఇదే సందర్భంగా టెలివిజన్ ఛానెల్స్‌లో ‘లవకుశ’ సినిమా పాటలు, దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. “రామ కథను వినరయ్యా” అనే పాట ప్రతి ఏడాది శ్రీరామనవమి సందర్భంగా ట్రెండింగ్‌లోకి వస్తోంది. ఈ ఏడాది కూడా అదే పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ఈ పాటను పొరపాటున వేరే గాయకుల పేరుతో పోస్టు చేసిన జబర్దస్త్ నటుడు ధన్‌రాజ్ వార్తల్లోకి ఎక్కాడు. ఈ అక్కాచెల్లెళ్లు ఈ పాటను పాడినట్లుగా పేర్కొంటూ ఓ వీడియో పోస్ట్ చేయగా, నెటిజన్లు వెంటనే దానిని ఖండించారు. అసలు ఈ పాటను పాడింది లెజెండరీ సింగర్లు పి. సుశీల, లీల గారన్నారు. వెంటనే తన పొరపాటును గ్రహించిన ధన్‌రాజ్… మరొక పోస్ట్‌లో ‘అసలైన గాయకులు సుశీల, లీలమ్మలు. తెలియక తప్పుడు సమాచారం ఇచ్చినందుకు క్షమించండి’ అంటూ క్షమాపణలు చెప్పారు.
ఇదిలా ఉండగా, నటుడిగా ప్రసిద్ధి పొందిన ధన్‌రాజ్ ఇటీవలే దర్శకుడిగానూ మారాడు. ‘రామం రాఘవం’ అనే చిత్రాన్ని దర్శకత్వం వహించడంతో పాటు, హీరోగా కూడా నటించాడు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. ప్రస్తుతం ఈ చిత్రం ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం అవుతోంది.
60 సంవత్సరాల క్రితం లవకుశ సినిమా కోసం పాడిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు … మళ్ళీ ఆ పాటను పాడి వినిపించారు, రాముడి పాట 60 సంవత్సరాలు సజీవంగా నిలబెట్టిన వారి జన్మధన్యమైంది.🙏 oka Group lo vochindi 🤗 pic.twitter.com/H7A7B5jlxn
— Dhanraj koranani (@DhanrajOffl) April 5, 2025

One thought on “శ్రీరామనవమి రోజున క్షమాపణలు చెప్పిన ధన్‌రాజ్.. ఎందుకంటే?”
Comments are closed.