హుగ్లీ గ్రామంలో పోస్టర్ అతికించబడిన ఘటన

జమ్మూ-కశ్మీర్ లో విధులు నిర్వర్తిస్తున్న పారా కమాండో గౌరవ్ ముఖర్జీకి బెదిరింపులు వచ్చాయి. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా ధనియాఖలి గ్రామంలోని ఆయన ఇంటి వద్ద శనివారం రాత్రి బెదిరింపు సందేశాలతో కూడిన పోస్టర్ ఒకటి అతికించారు. ఆ పోస్టర్‌లో “గౌరవ్ తల కావాలి,” “పాకిస్థాన్ జిందాబాద్” వంటి నినాదాలు వ్రాయబడ్డాయి. అలాగే, “హిందువులను రక్షిస్తే నీ కుటుంబాన్ని అంతం చేస్తాం,” “బెంగాల్‌ను బంగ్లాదేశ్‌గా మారుస్తాం” అనే బెదిరింపులు కూడా ఉన్నాయి.

గౌరవ్ కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. హుగ్లీ గ్రామీణ పోలీసు ఉన్నతాధికారులు సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి, సీసీటీవీ కెమెరాలు మరియు పోలీసులు 24 గంటల గస్తీ నిర్వహిస్తున్నారు.

సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా, పోస్టర్ అతికించిన సమయంలో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు స్కూటర్లపై అనుమానాస్పదంగా తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇది స్థానిక దుండగుల పని కావచ్చని అనుమానిస్తున్నప్పటికీ, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read More : PM దిగ్భ్రాంతి, పరిహారం ప్రకటించారు

One thought on “హుగ్లీ గ్రామంలో పోస్టర్ అతికించబడిన ఘటన

Comments are closed.