‘ఈ నగరానికి ఏమైంది 2’పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!

Tharun Bhascker

‘పెళ్లి చూపులు’తో టాలీవుడ్‌కి కొత్త ఒరవడి తీసుకొచ్చిన తరుణ్ భాస్కర్, తక్కువ బడ్జెట్‌లో హై క్వాలిటీ సినిమాలను రూపొందిస్తూ యువ దర్శకులకు ఆదర్శంగా నిలిచారు. కొంతకాలం నటనపై దృష్టి పెట్టిన ఆయన, ఈ ఏడాది దర్శకత్వానికి తిరిగి కమిట్‌ కానున్నట్టు సంకేతాలు ఇచ్చారు.

తన యూత్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఈ నగరానికి ఏమైంది’కు సీక్వెల్‌ చేయాలని అభిమానులు తరుణ్‌ను కొంతకాలంగా కోరుతున్నారు. విశ్వక్ సేన్, అభినవ్, వెంకటేష్‌, సుశాంత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మొదట మిశ్రమ స్పందనను పొందినా, రీ-రిలీజ్‌ సమయంలో భారీ వసూళ్లు రాబట్టింది. అప్పటి నుంచి సినిమా రెండో భాగంపై ఆసక్తి మరింత పెరిగింది.

తాజాగా, తరుణ్‌ భాస్కర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరిలో “ఈ” అక్షరాన్ని షేర్‌ చేయడం, అలాగే “ఈ సంవత్సరంలో కొన్ని బాకీలు తీర్చాలి” అని వ్యాఖ్యానించడం ఆసక్తిని కలిగించింది. ఇది ఖచ్చితంగా ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌పై సూచనగా అభిమానులు భావిస్తున్నారు.

ఈ చిత్ర మొదటి భాగాన్ని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇప్పుడు అదే బ్యానర్ సీక్వెల్‌ను నిర్మించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి!

Read More

One thought on “‘ఈ నగరానికి ఏమైంది 2’పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!

Comments are closed.