సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న జైలర్ 2 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే కీలకమైన దశను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కేరళలో కుటుంబ నేపథ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్‌లో రజనీకాంత్‌తో పాటు రమ్యకృష్ణ, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొంటున్నారు.
మొదటి భాగంలో ఆకట్టుకున్న మోహన్ లాల్, శివరాజ్ కుమార్ పాత్రలు మళ్లీ కొనసాగనున్నాయి. వీరి పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను థియేటర్లలో ఊగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలో టాలీవుడ్ నటసింహం బాలకృష్ణ కూడా చేరనున్నారని తెలుస్తోంది. బాలయ్య ఎంట్రీతో ఈ సీక్వెల్ మరింత ఘనంగా మారుతుందని అంచనాలు పెరిగాయి. హిందీ మార్కెట్‌లో కూడా ఆయనకున్న క్రేజ్ సినిమాకు ప్లస్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, ఈ ముగ్గురు స్టార్ గెస్ట్‌లు వేసవి తర్వాత సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు. జైలర్ 2 కథ మొదటి భాగం ముగిసిన స్థలంలో నుంచే ప్రారంభమవుతుంది. అలాగే కొత్త పాత్రలు కూడా చేరబోతున్నాయి. పాత్రల పేర్లు మారవని, బాలయ్య పాత్రకు ప్రత్యేకమైన పేరు పెట్టనున్నారు. ఈ సినిమా షూటింగ్‌కు సమాంతరంగా బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ 2లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

One thought on “జైలర్ 2లో స్టార్ ఫెస్టివల్: మోహన్‌లాల్, శివన్న, బాలయ్య ఒకే తెరపై!”
Comments are closed.