దిల్ రాజు – బ్లాక్‌బస్టర్ దర్శకుడితో పాన్ ఇండియా మల్టీస్టారర్!

Dilraju and Haneef

సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ఈ ఏడాది గేమ్ చేంజర్‌తో నిరాశ ఎదుర్కొన్నప్పటికీ, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయం సాధించారు. ప్రస్తుతం నితిన్ – శ్రీరామ్ వేణు కాంబినేషన్‌లో రూపొందుతున్న తమ్ముడు సినిమాను ఈ వేసవిలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే, విజయ్ దేవరకొండ – రవి కిరణ్ కొలా ప్రాజెక్ట్‌ను కూడా త్వరలో సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మలయాళ దర్శకుడు హనీఫ్ అదేని, ఇటీవల విడుదలైన నియో-న్వాయర్ యాక్షన్ థ్రిల్లర్ మార్కోతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. మలయాళ ఇండస్ట్రీలో అత్యంత హింసాత్మక చిత్రంగా ప్రచారం పొందిన ఈ సినిమా థియేటర్లలో భారీ విజయాన్ని సాధించింది. తెలుగులో డబ్బింగ్ వెర్షన్ కూడా మంచి వసూళ్లు రాబట్టింది.

ఈ నేపథ్యంలో, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లకు కేరాఫ్‌గా నిలిచిన దిల్ రాజు, హనీఫ్ అదేనితో ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని, హనీఫ్ ఇప్పటికే దిల్ రాజు ప్రొడక్షన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఈ సినిమా పాన్ ఇండియా మల్టీ స్టారర్‌గా రూపొందనున్నదని, భారతీయ సినీ పరిశ్రమకు చెందిన పలు భాషల్లో ఒకేసారి తెరకెక్కించనున్నట్లు సమాచారం. అయితే, కథానాయకుల వివరాలను చిత్రబృందం గోప్యంగా ఉంచింది. ఇందులో ఇద్దరు ప్రముఖ హీరోలు నటించనుండటం ఖాయమని తెలుస్తోంది. సినిమా జానర్‌ మరియు లీడ్ రోల్స్ ఎవరు అనేది తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!

Read More

One thought on “దిల్ రాజు – బ్లాక్‌బస్టర్ దర్శకుడితో పాన్ ఇండియా మల్టీస్టారర్!

Comments are closed.