14 ఏళ్ల బాలిక మృతి

జైపూర్‌లో మద్యం మత్తులో ఓ యువతి చేసిన రోడ్డుప్రమాదం ఒక కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. 14 ఏళ్ల బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషాదకర పరిణామం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే, జైపూర్‌లో నివాసముండే అసిమా అనే బాలిక తన తండ్రి మరియు చెల్లితో కలిసి ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదే సమయంలో మద్యం మత్తులో వాహనం నడుపుతున్న సంస్కృతి అనే యువతి వారు ఉన్న బైక్‌ను వేగంగా ఢీ కొట్టింది. గాయాల తీవ్రతతో అసిమా అక్కడికక్కడే మృతి చెందగా, తండ్రి, చెల్లికి స్వల్ప గాయాలయ్యాయి.

ప్రమాదం అనంతరం స్థానికులు తీవ్ర ఆగ్రహంతో స్పందించారు. తాగి వాహనం నడిపిన సంస్కృతి అనే యువతిని నిలదీసి కొట్టే ప్రయత్నం చేయగా, అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు అధికారులు వెల్లడించారు.

ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మద్యం సేవించి వాహనం నడపడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి చిన్నారిని బలిగొన్న యువతిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ముమ్మరంగా వినిపిస్తోంది.

Read More : 12 గంటల్లోనే తిరిగి పట్టుకున్న పోలీసులు