భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సోమవారం ఎంపీలకు ప్రత్యేక అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌తోపాటు హర్యానా, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఎంపీలు హాజరయ్యారు. విందు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎంపీలను వ్యక్తిగతంగా కలుసుకుని వారి నియోజకవర్గాల పరిస్థితుల గురించి వివరాలు తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు. ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ ప్రత్యేక విందుకు ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

One thought on “రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో ఎంపీలకు అల్పాహార విందు”
Comments are closed.