చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయాన్ని సాధించిన “కాంతార” ఇప్పుడు ప్రీక్వెల్‌గా వస్తోంది. మొదటి భాగం కేవలం రూ.2.5 కోట్ల ఓపెనింగ్‌తో ప్రారంభమై, అద్భుతమైన మౌత్ టాక్‌తో భారీ బ్లాక్‌బస్టర్‌గా మారింది. ముఖ్యంగా హిందీ మార్కెట్‌లోనే రూ.100 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం. ఈసారి “కాంతార చాప్టర్ 1” పేరుతో రాబోతున్న ఈ చిత్రం, గ్లోబల్‌గా రూ.800-1000 కోట్ల గ్రాస్ వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
సినిమా విడుదల తేదీలు మారడంతో కొన్ని సినిమాలకు అనూహ్యంగా లాభం కలుగుతోంది. “కాంతార 2″కు ఇది మంచి బూస్ట్‌గా మారింది. బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ నటించిన చిత్రం వాయిదా పడటంతో, ఈ సినిమా హిందీ మార్కెట్‌లో గాంధీ జయంతి రోజు సింగిల్ రిలీజ్ అవుతోంది. దసరా సెలవులు కలసి రావడంతో, ఈ చిత్రం భారీ వసూళ్ల దిశగా వెళ్తుందని అంచనా.
ఈ చిత్రానికి రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. అడవి, సంప్రదాయాలు, దైవభక్తి, గ్రామీణ జీవనశైలి వంటి అంశాలను మరింత డీప్‌గా చూపించనున్నారు. “కాంతార” మొదటి భాగం మలయాళ, తమిళ, తెలుగు మార్కెట్లలో మంచి విజయాన్ని అందుకున్నందున, ఈసారి విడుదలను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం బాక్సాఫీస్ పోటీని చూస్తే, “కాంతార 2” ప్రధానంగా “వార్ 2” సినిమాతో ఢీకొనబోతోంది. అయితే, “వార్ 2″కు ఇంకా సమయం ఉండటంతో, “కాంతార 2” తన స్థానం పక్కాగా సెట్ చేసుకుంది. బాలీవుడ్‌లో పెద్దగా పోటీ లేకపోవడం, సౌత్‌లో హైప్ ఎక్కువగా ఉండటం వల్ల, 2025లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలవాలనే ఆశలు పెరిగాయి.

One thought on “కాంతార 2 రిలీజ్ – దసరా కానుకగా భారీ విజయానికి ముహూర్తం”
Comments are closed.