అందాల దివి.. స్టన్నింగ్ లుక్‌తో ఆకర్షణ!

Divi Vadthya latest photoshoot

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దివి వాధ్యా తాజాగా మరోసారి అభిమానులను ఆకట్టుకుంది. బిగ్‌బాస్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, అనంతరం టాలీవుడ్‌లో నటిగా, యాంకర్‌గా, మోడల్‌గా బిజీ అయింది. ‘లంబసింగి’ చిత్రంతో కథానాయికగా తెరపై కనిపించిన దివి, తన అందంతోనే కాకుండా స్టైల్‌తోనూ ప్రత్యేకతను చాటుకుంటుంది.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎలిఫెంట్ ముద్రలతో డిజైన్ చేసిన బ్లూ షార్ట్ కాఫ్టాన్ డ్రెస్‌లో ఓ కొండ ప్రాంతం నేపథ్యంగా క్లాస్ లుక్స్‌తో మెరిసిపోయింది. “వెధర్ ఇంత బాగుంది, కానీ నువ్వు నా పక్కన లేవు.. నీకైనా ఇది న్యాయమా?” అంటూ పెట్టిన క్యాప్షన్ ఫాలోవర్లను మరింత రొమాంటిక్ మూడ్‌లోకి తీసుకెళ్లింది.

ప్రకృతి అందాల మధ్య దివి స్టన్నింగ్ లుక్‌ను చూసిన ఫ్యాన్స్ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఫ్యాషన్ ట్రెండ్స్‌ను అనుసరిస్తూనే, తన ప్రత్యేకమైన క్లాస్ టచ్‌ను మిస్ కాకుండా పోజులిస్తూ ఆకట్టుకుంటుంది. ఫిట్‌నెస్ వీడియోలు, గ్లామర్ ఫొటోషూట్లతో తరుచూ ట్రెండ్ అవుతున్న దివి.. ఇక మరోసారి ఏ అప్‌డేట్ ఇవ్వబోతుందో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read More

One thought on “అందాల దివి.. స్టన్నింగ్ లుక్‌తో ఆకర్షణ!

Comments are closed.