ఏప్రిల్ 15 నుంచి తత్కాల్ బుకింగ్ టైమింగ్స్‌లో మార్పులు – ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం..

రైల్వే ప్రయాణికులకు సంబంధించి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కీలక మార్పులను ప్రకటించింది. తత్కాల్ టికెట్ బుకింగ్ సమయాల్లో మార్పులు చేస్తూ ఈ మార్పులు ఏప్రిల్ 15 నుండి అమల్లోకి వస్తాయని వెల్లడించింది.

తాజా మార్పుల ప్రకారం, A/C కోచ్‌ల కోసం తత్కాల్ బుకింగ్ టైమింగ్‌ను ఇప్పటివరకు ఉదయం 10 గంటలుగా ఉండగా, ఇకపై ఇది ఉదయం 11 గంటలకు మారనుంది. అలాగే, స్లీపర్ క్లాస్ తత్కాల్ బుకింగ్ టైమింగ్‌ను ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటలకు మార్చారు.

ప్రీమియం తత్కాల్ టికెట్ బుకింగ్ టైమింగ్‌లోనూ స్వల్ప మార్పులు జరిగాయి. ఇది ఇప్పుడు ఉదయం 10 గంటల నుంచి 10:30 వరకు మాత్రమే ఉంటుంది. దీనితో పాటు, ఏజెంట్లకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

ప్రయాణికులు టికెట్ బుకింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, మారిన టైమింగ్‌లను గమనించి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.

Read More : కేరళలో బంగారు గొలుసు మింగిన దొంగకు అరటి పళ్లతో చికిత్స – పోలీసుల విచిత్ర చర్య

One thought on “ఏప్రిల్ 15 నుంచి తత్కాల్ బుకింగ్ టైమింగ్స్‌లో మార్పులు – ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం..

Comments are closed.