దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలైన నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్‌లో ఈ ఉదయం బలమైన భూప్రకంపనలు సంభవించాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇళ్లలో, కార్యాలయాల్లో ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు. ప్రాథమిక సమాచారం మేరకు, ఈ భూకంప కేంద్రం హర్యానాలోని రేవారి జిల్లా గురవార ప్రాంతం సమీపంలో నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. భూకంప తీవ్రత, గమనించిన ప్రాంతాల వివరాలు పూర్తి కావాల్సి ఉంది.
ఈ ప్రకంపనలు ఢిల్లీ సహా ఎన్‌సీఆర్ ప్రాంతాలన్నిట్లో స్పష్టంగా అనిపించాయి. ప్రస్తుతం భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించిందో తెలుసుకునేందుకు అధికారులు మౌలిక సమాచారాన్ని సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
Read More : బిడ్డకు డీఎన్ఏ టెస్ట్ అవసరం లేదు: High Court
